జాతీయంతెలంగాణరాజకీయం

కేంద్రమంత్రి తల నరికితే భూమి రాసిస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల నరికి తెస్తే తనకున్న ఎకరం 38 గుంటల భూమి రాసిస్తానని ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిట్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాహుల్ తలను తీసుకొచ్చిన వారికి రివార్డు ఇస్తామన్న రవనీత్ సింగ్ బిట్టు కామెంట్లపై ఖానాపూర్ ఎమ్మెల్యే మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెడ్మ బొజ్జు.. రాహుల్ తలను తీసుకొచ్చిన వారికి రివార్డు ఇస్తానన్న రవనీత్ సింగ్ తలను తీసుకొస్తే తన మొత్తం ఆస్తి రాసిస్తానని చెప్పారు. తన తండ్రి పేరుమీద ఉన్న ఆస్తిని కూడా బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.

బీజేపీ గూండాలకు తిండిపెట్టి పోషిస్తోందని బొజ్జు విమర్శించారు. కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే హోంమంత్రి అమిత్ షా ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పై బురద జల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడితే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ట్విట్టర్ పక్షి కేటీఆర్ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు వెడ్మ బొజ్జు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button