క్రైమ్తెలంగాణ

ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య..గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు

క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి): ములుగు జిల్లాలోని వాజేడు లో మావోయిస్టులు పోలీసుల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ను గురువారం రాత్రి గుడ్డలతో నరికి హత్య చేశారు. మృతుల్లో ఒకరైన పెనుగోలు గ్రామస్తుడు రమేష్ ఇదే మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మృతదేహాల వద్ద మావోయిస్టులు లేఖలను వదిలారు.

గతంలో హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లా, ఛత్తీస్ గడ్ సరిహద్దులో వరుస ఎన్ కౌంటర్లు జరిగిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడటం సంచలనం కలిగించింది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

 

Spread the love
Back to top button