తెలంగాణ

ఇదేం ఖర్మ.. జైలు ముందు 3 గంటలు కేటీఆర్, హరీష్ పడిగాపులు

బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి.. ఈ సామెత రాజకీయాల్లో బాగా సూటవుతుంది. అధికారం ఉన్నప్పుడు అన్ని అనుభవించే నేతలు పవర్ పోగానే రీజలవుతారు. పవర్ లో ఉండగా అజమాయిషీ చేసే నేతలు విధి వక్రీకరిస్తే రోడ్డుమీద నిలబడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి ఘటన తెలంగాణ నేతలకు దక్కింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత బెయిల్ సందర్భంగా ఢిల్లీలో కనిపించిన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వడంతో 165 రోజుల అనంతరం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చింది. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ కేడర్ సంబరాలు చేసుకుంది. కేసీఆర్ కుటుంబంలో ఆరు నెలల తర్వాత పండుగ వాతావరణం కనిపించింది. అయితే కవిత బెయిల్ పిటిషన్ విచారణకు ఒక రోజు ముందే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వచ్చారు. న్యాయవాదుల ఇండ్ల చుట్టూ తిరిగి చర్చలు జరిపారు. కొన్ని సార్లు ఆటోలో వెళ్లారు కేటీఆర్. ఇక సుప్రీంకోర్టులోనూ సాధారణ వ్యక్తుల్లా తిరిగారు. చేతివేళ్ల గోర్లు కొరుకుతూ టెన్షన్ టెన్షన్ గా కనిపించారు.

ఇక కవితకు బెయిల్ వచ్చాకా జైలు నుంచి రిలీజ్ చేసే ప్రాసెస్ చేయడానికి కేటీఆర్, హరీష్ రావు పరుగులు పెట్టారు. సుప్రీంకోర్టు నుంచి రౌస్ ఎవెన్యూ కోర్టుకు.. అక్కడి నుంచి తీహార్ జైలుకు పత్రాలు తీసుకుని పరుగులు పెట్టారు. సాయంత్రం 7 గంటలకు బెయిల్ వస్తుందనే సమాచారం 6 గంటల నుంచే జైలు బయట నిల్చున్నారు. కాని కవిత జైలు నుంచి దాదపు 9 గంటల 10 నిమిషాల సమయంలో వచ్చింది. అంటే 6 నుంచి 9 వరకు దాదాపు 3 గంటల పాటు తీహార్ జైలు బయటే నిల్చున్నారు కేటీఆర్, హరీష్ రావు. జైలు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లాలని చెప్పగా వారిని బతిమాలుడుతూ అక్కడే నిల్చున్నారు. కవిత రాగానే ముందుకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు కేటీఆర్. ఇది చూసిన వారు వీళ్లేనా పదేళ్లు అధికారం చెలాయించిన నేతలు అనేలా కనిపించింది.

Related Articles

Back to top button