Telangana

ఆపరేషన్ ఆకర్ష్‎తో బీజేపీ ఖుష్.. అభ్యర్థుల ప్రకటనపై నాయకుల జోష్..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే తెలంగాణలో 9 స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పట్టున్న ప్రాంతాల్లో పకడ్బందీగా నేతలను బరిలో దింపిన కమలదళం.. మిగిలిన స్థానాల్లో బలమైన నేతల కోసం పక్కా వ్యూహంతో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే మొత్తం ఆరుగురు బిఆర్ఎస్ నేతలతో పాటు మరో నేత కాషాయ కండువా కప్పుకున్నారు. ఇద్దరికి చేరిన కొన్ని గంటల్లోనే తొలిజాబితాలో స్థానం దక్కింది. తాజాగా చేరిన నలుగురు నేతలకు టికెట్ కన్ఫర్మ్ అనే టాక్ వినిపిస్తోంది. బిజెపి స్టైల్‎లో జరుగుతున్న చేరికలను గమనిస్తే రాష్ట్రంలో బిఆర్ఎస్ టార్గెట్‎గా వెళ్తోంది. పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్‎తో ఒరిగేదేమి లేదని ప్రచారం చేస్తూ.. కేంద్రలో తమ విజయ అవకాశాలను ఎరగా వేసి నేతలను పార్టీలోకి చేర్చుకుంటోంది. బిజెపి వ్యూహంతో బిఆర్ఎస్ ఖాళీ అవుతుంటే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు కఠినమైన పరీక్ష ఎదరవ్వక తప్పదనిపిస్తోంది. రాష్ట్రంలో డబుల్ డిజిట్ టార్గెట్‎తో దూసుకెళ్తున్న కమలం పార్టీ మిగిలిన రెండు పార్టీలకు ట్రబుల్ క్రియేట్ చేస్తోంది.

Also Read : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం.. నేడు భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్

తమకు బలమైన అభ్యర్థులు లేని చోట బిజెపి ఆచీతూచి అడుగేస్తోంది. బిఆర్ఎస్‎లో సిట్టింగ్ లేదా మాజీలకు గాలం వేస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పొయిన బిఆర్ఎస్‎ను వీడేందుకు ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అందులో లోక్ సభ ఎన్నికలకు పనికొవచ్చే వారిని కమలదళం ఒడిసిపట్టుకొని పార్టీలో చేర్చుకుంటోంది. ఆ కోవలోనే సిట్టింగ్ ఎంపీలు బిబి పాటిల్, పొతుగంటి రాములు కాషాయం కండువా కప్పుకోవడం.. బిబి పాటిల్ కు జహిరాబాద్ టికెట్, రాములు కుమారుడు భరత్‎కు నాగర్ కర్నూలు స్థానం ఇవ్వడం చకాచకా జరిగిపోయాయి. మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ స్థానాలకు సరైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్న బిజెపి.. అసంతృప్త బిఆర్ఎస్ నేతలతో టచ్‎లోకి వెళ్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతారాం నాయక్‎తో కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి నేరుగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందే బ్యాక్ గ్రౌండ్ హోం వర్క అంతా బిజెపి పూర్తి చేసింది. ఖమ్మం నుంచి జలగం వెంకట్ రావు‎తో చర్చలు జరిపి పార్టీలో చేర్చుకున్నారు. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ నగేశ్‎ను ఒప్పించి బిజెపిలోకి లాక్కున్నారు. నల్గొండ స్థానానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సైలెంట్‎గా బిజెపిలోకి వచ్చేశారు. పెద్దపల్లి శ్రీనివాస్‎ను జాయిన్ చేసుకున్నారు. ఇలా అందివచ్చిన నేతలను చేజారిపోకుండా.. చాకచాక్యంగా బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీ తీసుకెళ్లి దగ్గరుండి పార్టీ కండువాలు కప్పిస్తున్నారు. బిఆర్ఎస్‎ను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేరికలు సాగుతున్నాయి.

Read Also : కాంగ్రెస్ వైపు మరో బీఆర్ఎస్ నేత చూపు.. శరవేగంగా మారుతున్న రాజకీయాలు!!

ఓ వైపు చేరికలతో గులాబీ పార్టీని ఖాళీ చేస్తున్న బిజెపి.. మరోవైపు బలమైన ప్రత్యర్థులను రెడీ చేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్‎కు గట్టి సవాల్ విసురుతోంది. దీంతో చాలా చోట్ల కాంగ్రెస్‎కు టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని కాషాయదళం ధీమా వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‎ను కంగారుపెడుతోంది. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో అమలులో విఫలమైందని బిజెపి తూర్పారపడుతోంది. పదేళ్ల మోడీ పాలనకు ఓటు వేయమని అడిగే దమ్ము తమకు ఉందని.. రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము కాంగ్రెస్‎కు ఉందా అంటూ సవాల్ విసురుతోంది. కాంగ్రెస్‎ను హమీలపై విడిచిపెట్టబోమని.. లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో జయకేతనం ఎగురవేసి మరింత పోరాటం చేస్తామని బిజెపి అంటోంది. బిజెపిలోకి వలసలు ఇంకా కొనసాగుతాయని ఆ పార్టీ సంకేతాలు ఇస్తోంది. వరంగల్ నుంచి ఓ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అభ్యర్థుల ప్రకటనతోనే కాదు.. మిగిలిన స్థానాల్లో అనువైన నేతల కోసం బిజెపి కచ్చితమైన ప్రణాళికతో ఇటు బిఆర్ఎస్.. అటు కాంగ్రెస్‎ను కలవరపెడుతోంది.

ఇవి కూడా చదవండి : 

  1. చనిపోయిన స్నేహితురాలు పిలుస్తోందంటూ వివాహిత ఆత్మహత్య..
  2. ఆ జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేక్… ఎందుకో తెలుసా?
  3. ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పున‌ర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి
  4. హీటెక్కుతున్న లోక్‌సభ ఎన్నికల పోరు.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పదా??
  5. వృద్ధాప్యంలో తల్లిన పట్టించుకోని కొడుకు.. కుమారుడు, కోడలికి జైలు శిక్ష!!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.